- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ ముస్కాన్‌లో రాచకొండ పోలీసుల రికార్డ్..
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 'ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతంగా ముగిసిందని సీపీ సుధీర్ బాబు తెలిపారు.

దిశ, మల్కాజిగిరి : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 'ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతంగా ముగిసిందని సీపీ సుధీర్ బాబు తెలిపారు. నెల రోజుల పాటు జరిగిన ప్రత్యేక డ్రైవ్‌లో రాచకొండ పోలీసులు రికార్డు స్థాయిలో 2479 మంది బాల కార్మికులను రక్షించారని, బాలల రక్షణ చర్యలలో రాష్ట్రంలోనే రాచకొండ కమిషనరేట్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో, మహిళా భద్రతా విభాగం డీసీపీ టి.ఉష రాణి మార్గదర్శకత్వంలో ఈ ఆపరేషన్ కొనసాగింది.మొత్తం 9 ప్రత్యేక బృందాలు ఇటుక బట్టీలు, నిర్మాణ స్థలాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు వంటి ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి 2353 మంది బాలురు, 126 మంది బాలికలకు విముక్తి కల్పించారు. వీరిలో తెలంగాణకు చెందిన 1077 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 1269 మంది నేపాల్ దేశానికి చెందిన 12 మంది పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాలపై 530 కేసులు నమోదు చేసి, 556 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రక్షించిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు, కొందరిని చైల్డ్ కేర్ హోమ్‌లకు తరలించారు.'ఆపరేషన్ స్మైల్' ఆపరేషన్ ముస్కాన్' ద్వారా రాచకొండ పోలీసులు మొత్తం 3550 మంది పిల్లలను రక్షించారు.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించాలని, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే డయల్ 100, 112 లేదా 1098 కు సమాచారం అందించాలని కమిషనర్ సుధీర్ బాబు కోరారు.






