నిజాంపేట్ లో అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు గాలికి..

by Disha Web Desk 20 |
నిజాంపేట్ లో అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు గాలికి..
X

దిశ, కుత్భుల్లాపూర్ : నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో గత మూడు సంవత్సరాలుగా రూ.140కోట్లతో 287ఇంజనీరింగ్ సీసీ, బీటి, యుజీడీ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ చేయడం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. నిజాంపేట్ పరిధిలో చేపట్టిన పలునాసిరకం పనులను శుక్రవారం వారు పరిశీలించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిజాంపేట్ కార్పొరేషన్ లో సీసీ రోడ్ల నందు నాణ్యత ప్రమాణాలు టెస్టులలో పాస్ కాకుండా పూర్తిస్థాయి బిల్లులు అధికారులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ సెక్షన్లో ఏఈ ధీరజ్ రెడ్డి, మేయర్ భర్తతో కలిసి 28 శాతం ప్రతి ఫండ్ లో కమీషన్ తీసుకొని పనిచేయడం వల్ల నాణ్యత ప్రమాణాలు లేవని ఆరోపించారు.

ఏఈ ధీరజ్ కాంట్రాక్టర్ చంద్రశేఖర్ తో మిలాకత్ అవడంతో కాంట్రాక్టర్ చేసిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు లేకున్నా, పూర్తి బిల్లు ఇవ్వడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ చంద్రశేఖర్ శ్రీ హోమ్స్ కాలనీ నందు సీసీ రోడ్లు ఎం10 కాంక్రీట్ వేయకుండానే ఎం30తో రోడ్డు పూర్తి చేసినా 37లక్షలు పూర్తీ బిల్లు ఏవిధంగా చెల్లించారని నిలదీశారు. నందనవనం కాలనీలో రోడ్లు పగుళ్లు, క్వాలిటీ టెస్టులో ఫెయిల్ అయిన కాంట్రాక్టు చంద్రశేఖర్ కి ఎం30 కాంక్రీట్ సిసి రోడ్డు గా పరిగణించి 44 లక్షలు రూపాయలు చెల్లించడం ఏవిధంగా సక్రమమో ప్రజా ప్రతినిధులు తెలిపాలని అన్నారు. సాయి నగర్ లో 90 లక్షలతో డిస్ట్లింగ్ వర్క్ లో అంచనాలు పెంచడం, నిజాంపేట్ లో వైకుంఠధామం పనుల్లో అంచనాలు పెంచి చంద్రశేఖర్ కాంట్రాక్టర్ కీ కట్టబెట్టారు ఇది నిజం కాదా అని ప్రశ్నించారు.

కార్పొరేషన్ పరిధిలో టెండర్లు కాంట్రాక్టు ఎంపికలో అవకతవకలు, నాణ్యత ప్రమాణాలు లేకపోవడం, 28శాతం కమీషన్లతో నాణ్యత పనులు ఎలా సాధ్యమని అన్నారు. చంద్రశేఖర్ అనే కాంట్రాక్టర్ తో ఏఈ ధీరజ్ రెడ్డికీ ఉన్న బలమైన బంధంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకుంటున్న మేయర్ భర్త పాత్ర పై విచారణ జరపాలని, నాణ్యత ప్రమాణాలు లేకుండా పనులు చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతధికారులకు విన్నవించారు. పనులు, కాంట్రాక్టులు, కమీషన్లు, అధికారులు, మేయర్ భర్త పాత్ర పై అతిత్వరలోనే విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రామచంద్రనాయక్, ప్రధాన కార్యదర్శి బిక్షపతి యాదవ్, సెక్రటరీ శేషారావు, మహిళా మోర్చా సెక్రెటరీ మంజు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed