రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

by Sridhar Babu |

ఐడీఏ ఉప్పల్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ కిరణ్ కుమార్ తెలిపారు.

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
X

దిశ,ఉప్పల్ : ఐడీఏ ఉప్పల్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ కిరణ్ కుమార్ తెలిపారు. రోడ్డు మరమ్మతుల కారణంగా 11 కేవీ ఎల్ఎన్ నగర్ ఫీడర్ పరిధిలో టీవీ కాలనీ, గాంధీనగర్, నేతాజీ నగర్, అరవింద్ నగర్, శ్రీరమణపురం, చర్చి కాలనీ, శ్రీరామ కాలనీ, కేటీఆర్ కాలనీ, జనప్రియ అపార్ట్మెంట్స్, జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్, రామంతాపూర్ రోడ్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.

11 కేవీ విజయపురి కాలనీ ఫీడర్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి 30 నిమిషాల వరకు విజయపురి కాలనీ, శ్రీరామ్ కాలనీ, సాయిబాబా కాలనీ, భగవత్ లేఔట్, ఆరెంజ్ రియాలిటీ, బొప్పన చెరువు గుడి లైన్, సృజన స్కూల్ లైన్ పరిసరాల ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని, అలాగే 11కేవీ ఉప్పల్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు లక్ష్మారెడ్డి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లైన్, సాయి నగర్ కాలనీ, హనుమాన్ సాయి నగర్, సూర్యనగర్ పరిసరాల ప్రాంతాలలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ కిరణ్ కుమార్ తెలిపారు.

Next Story