రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం...

by S Gopi |   (  Updated:2023-02-25 12:58:02  IST  )

చర్లపల్లి సబ్ స్టేషన్ 33/11 కేవీ పరిధిలో ఆదివారం ఉదయం 10-30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు... Power outage

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం...
X

దిశ, కాప్రా: చర్లపల్లి సబ్ స్టేషన్ 33/11 కేవీ పరిధిలో ఆదివారం ఉదయం 10-30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వర్క్ కారణంగా చర్లపల్లి, ఐడీఎ ఫేస్ త్రీ పరిధిలోని ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ గజ్నా టబ్రా ఫీడర్, 11కేవీ ఫేస్ 4, మైక్రొ మేదా, 11కేసీ జనూమ్, చర్లపల్లి సబ్ స్టేషన్ 2 పరిధిలోని ఐడీఐ ఫేస్ 1, ఇసీనగర్, ఐజీమింట్ కంపోండ్, బీఎన్ రెడ్డినగర్, రైల్ విహార్ కాలనీ, మహాలక్ష్మినగర్, పరిధిలోని మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు 11 కేవీ శ్రవన్ ఎలక్ట్రానిక్స్ ఫీడర్, 11కేవీ భగవతి గ్రనేట్స్, నవోదయాకాలనీ, ఐకాంమ్, ఫేస్ 5, నవోదయకాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సిబ్బందికి సహాకరించాలని ఏఈ రవీందర్ కోరారు.

Next Story