- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాస్టల్ గదులలో బూతు బొమ్మలు
by velandi.Saikiran |
హాస్టల్ గదులలో బూతు బొమ్మలు ఎస్టీ బాలుర కళాశాల వసతి గృహాల్లో సమస్యల తిష్ట..

X
దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస వసతులు లేక విద్యార్థులు అరకొర వసతుల మధ్యే గృహాల్లో గడుపుతున్నారు. వసతి గృహంలో మరుగుదొడ్లలో అపరిశుభ్రత, చెత్త పేరుకుపోయి విద్యార్థులు చెత్తతో సావాసం చేయాల్సిన దుస్థితి నెలకొంది. కొంత మంది ఆకతాయిల వెకిలి చేష్టలతో హాస్టల్ గదులు బూతు బొమ్మలతో నిండిపోయాయి. ఆకతాయిల చేష్టలతో కష్టపడి చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బూతు బొమ్మల కారణంగా తమ తల్లిదండ్రులు హాస్టల్ కు కలిసేందుకు రానివ్వకుండా బయటనే కలుస్తున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. హాస్టల్ వార్డెన్ కు సమస్యలపై పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Next Story






