- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెలిపించినందుకు పేదల ఇళ్లు కూలుస్తున్నారు
కేసీఆర్ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి రేవంత్ ప్రభుత్వానికి పట్టం కట్టారని, కానీ స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రజలు విసిగిపోయారని మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి రేవంత్ ప్రభుత్వానికి పట్టం కట్టారని, కానీ స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రజలు విసిగిపోయారని మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డితో కలిసి బుధవారం రామంతాపూర్ లోని బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్ లోని మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ...దశాబ్దాలుగా కష్టించి ఇళ్లు కట్టుకున్న పేదల నివాసాలను కూలుస్తూ వారికి కంటిమీద కునుకు లేకుండా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు.
లక్షల కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన చేస్తామంటున్న ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్టు పై డీపీఆర్ లేదని, ప్రణాళికలు రూపొందించలేదని చెబుతున్నప్పటికీ మూసీ ఒడ్డున కట్టుకున్న ఇళ్లను మాత్రం కూల్చివేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఆదివారం వస్తుందంటే నగరంలో భయభ్రాంతులకు గురవుతున్నారని, దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మూసీ నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని, వారు చేసే పోరాటంలో తప్పకుండా తన వంతు సహకారం అందిస్తామన్నారు. పేదల జీవితాలతో ఆడుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన సూచించారు.






