ఇంటి అద్దె, ఇతర నియమకాలకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి : సీఐ ధనుంజయ

by Naga Rani Yarlagadda |

ప్రజల భద్రత, శ్రేయస్సులో భాగంగా ప్రజలు పోలీస్ వెరిఫికేషన్ ను తప్పనిసరిగా చేయించుకోవాలని నాచారం సీఐ ధనుంజయ సూచించారు.

ఇంటి అద్దె, ఇతర నియమకాలకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి : సీఐ ధనుంజయ
X
  • నిర్ధారణ జరిగితే.. నిరంతర నిఘా
  • అవకాశాన్ని వినియోగపరచుకొని నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలి
  • నాచారం సీఐ ధనుంజయ

దిశ, నాచారం : ఇంటి అద్దె, వంట మనిషి, వాచ్మెన్, పనిలో కార్మికులను వంటి వాటిల్లో అపరిచిత, కొత్త వ్యక్తులు నియామక సందర్భంలో పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరని నాచారం సీఐ ధనుంజయ సూచించారు. మల్లాపూర్ బాబానగర్ లో ఇంటి అద్దెకు ఉన్న యువకుడు యజమాని నగలు, ఇతర ఆస్తిపై కన్నేసి ఇంటి యజమానురాలైన వద్ధురాలిని గొంతు నుమిలి కర్కశంగా హత్య చేశాడు. ఇలాంటి అనేక సంఘటనలు నగరంలో కోకొల్లలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజల భద్రత, శ్రేయస్సులో భాగంగా .. పోలీస్ వెరిఫికేషన్ ను తప్పనిసరిగా చేయించుకోవాలని నాచారం సీఐ ధనుంజయ సూచించారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతలకు పోలీస్ యంత్రాంగం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ సందర్భంగా పోలీస్ వెరిఫికేషన్ కు సీఐ సూచన చేశారు. ఇంటి అద్దె, వాచ్మెన్, వంట మనిషి, ఆయా, కార్మికులను పనిలో పెట్టుకోవడం, ఉద్యోగాల్లో నియమించుకోవడం వంటి ఎలాంటి నియామక ఉద్దేశంలోనైనా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వెరిఫికేషన్ చేయించుకోవడం వల్ల కొత్త వ్యక్తుల ప్రవర్తన, గత చరిత్ర, నేరచరిత్ర వంటి విషయాలు నిర్ధారణ జరుగుతాయన్నారు. ఈ వెరిఫికేషన్ అనేది ప్రజల రక్షణ, భద్రతకేనని చెప్పారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడడానికి.. పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.

నిర్ధారణ జరిగితే నిరంతర నిఘా..

పోలీస్ వెరిఫికేషన్ కు నాచారం పోలీస్ స్టేషన్లో ప్రత్యేక తగినంత సిబ్బంది అందుబాటులో ఉన్నారని సీఐ తెలిపారు. నిరంతరం 24 గంటలు పోలీస్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు. నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి సంబంధిత వివరాలు జతపరిచితే.. వెంటనే వెరిఫికేషన్ పూర్తిచేసి సమాచారాన్ని అందిస్తామ న్నారు. ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ జరిగితే సంబంధిత వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. వారి కదలికలు, కార్యకలాపాలపై పోలీస్ సిబ్బంది కనిపించని నిఘా ఉంటుందన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే.. నేరాల నియంత్రణ

శాంతి భద్రత, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని నాచారం సీఐ ధనుంజయ వెల్లడించారు. ప్రజలు తమ ఇళ్లల్లో, కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, దాంతో పాటుగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకొని నేరాల నియంత్రణకు భాగస్వాములు కావాలని సీఐ పిలుపునిచ్చారు.

Next Story