- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూకట్‌పల్లిలో కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడి
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై సైబరాబాద్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు

దిశ, బాలానగర్: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై సైబరాబాద్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. తెల్లవారుజామున డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడుల్లో పబ్ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఏర్పాటు చేసి, వారితో చాటింగ్‌లు చేయించడం ద్వారా యువకులను పబ్‌కు రప్పిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున గానా బజానా నిర్వహిస్తూ డాన్స్ ఫ్లోర్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల సందర్భంగా పబ్‌లో ఉన్న పలువురు యువతులు, కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ వ్యవహారంలో పబ్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సమాచారం. పబ్ నిర్వహణకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలను స్వాధీనం చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పబ్‌లు, బార్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.






