- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయం : కాప్రా కాంగ్రెస్ అధ్యక్షులు నాగశేషు
ప్రజా సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొబ్బనూరి నాగశేషు పేర్కొన్నారు.

దిశ, కాప్రా : ప్రజా సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొబ్బనూరి నాగశేషు పేర్కొన్నారు. శనివారం కాప్రా డివిజన్ రెడ్డి కాలనీలో రూ.42 లక్షల నిధులతో చేపట్టిన భూగర్భ మురుగునీటి కాల్వ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల ప్రారంభాన్ని హర్షిస్తూ... సీఎం రేవంత్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం నాగశేషు, మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్ మాట్లాడుతూ.. రెడ్డి కాలనీలో భూగర్భ మురుగునీటి కాలువ సమస్య తీవ్రంగా మారడంతో మందముల పరమేశ్వర్ రెడ్డి చెరువుతో రూ. 42 లక్షల నిధులను మంజూరు చేయించి పనులను ప్రారంభించినట్లు తెలిపారు.
డివిజన్ లో ఇప్పటికే కాప్రా చెరువు అభివృద్ధికి రూ.35 కోర్టులో, ఫుట్ బాల్ స్టేడియం నిర్మాణాలకు రూ.13 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి గూడ నుంచి కాప్రా ప్రధాన రహదారిలో బాక్స్ బ్రెయిన్ అభివృద్ధి పనులతో పాటు డివిజన్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇక భూగర్భ డ్రైనేజీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని వారు పేర్కొన్నారు. డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మౌలిక సదుపాయాలు కల్పన ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏఎంసీ మాజీ డైరెక్టర్ కొబ్బనూరి నాగరాజు, మురళి, శ్రీకాంత్, మల్లారెడ్డి, శ్రీధర్ రెడ్డి, జగదీష్, నరేందర్ గౌడ్, రాజు, రెడ్డి కాలనీ ప్రధాన కార్యదర్శి ప్రేమిక, రాజశేఖర్, తిరుపతి, ప్రణీత్ పాల్గొన్నారు.






