పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన జయ ప్రదం చేయండి

by velandi.Saikiran |

ఆక్టోబర్ 7న హైదరాబాద్ లో నిర్వహించే పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన జయప్రదం చేయాలని సిపిఐ ఉప్పల్ మండల కార్యదర్శి

పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన జయ ప్రదం చేయండి
X

దిశ, నాచారం : ఆక్టోబర్ 7న హైదరాబాద్ లో నిర్వహించే పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన జయప్రదం చేయాలని సిపిఐ ఉప్పల్ మండల కార్యదర్శి టి. సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో నాచారం చౌరస్తా లోని పాలస్తినా సంఘీభావ కరపత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సిపిఐ ఉప్పల్ మండల కార్యదర్శి టి .సత్య ప్రసాద్ మాట్లాడారు. ఆకారణం గా యుద్ధం ప్రకటించి వికటాట్టహాసం చేస్తున్న వికృత విన్యాస నరహంతకులు బెంజి మోన్ నెతన్యాహూ, డోనాల్డ్ ట్రంప్ అని మండిపడ్డారు. 24 నెలల కాలంలో 65 వేల మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకొని, కనీస యుద్ధ విలువలను పాటించ కుండా తమ నరమేథాన్ని సాగిస్తూనే ఉండడం దుర్మార్గమన్నారు.

తక్షణమే పాలస్తీనా పై యుద్దాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా లోని గాజా ప్రజలను ప్రపంచ దేశాలు ఆదుకోవాలని కోరారు. అక్టోబర్ 7న హైదరాబాద్ నగరంలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యలో భారీ స్థాయిలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటించామని తెలిపారు. వి ఎస్ టీ నుండి ఇందిరా పార్క్ దాకా జరిగే ప్రదర్శనను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్ర మంలో సిపిఐ ఉప్పల మండల నాయకులు వి. రాజ్ కుమార్, కే. శ్రీకాంత్ మేడ్చల్ జిల్లా ఏఐవైఎఫ్ నాయకులు ఎం శేఖర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Next Story