MLA Mallareddy : రైతులు రాజులు కావాలన్నదే మా పార్టీ లక్ష్యం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

by Muthe.Rajitha |

రైతులు రాజులు కావాలన్నదే తమ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(BRS MLA Mallareddy) పేర్కొన్నారు.

MLA Mallareddy : రైతులు రాజులు కావాలన్నదే మా పార్టీ లక్ష్యం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులు రాజులు కావాలన్నదే తమ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(BRS MLA Mallareddy) పేర్కొన్నారు. మంగళవారం మేడ్చల్‌(Medchal) లోని పూడూర్‌ గ్రామంలో రూ. 4.70 కోట్లతో నూతనంగా నిర్మించిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌(Food Processing Unit)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ లక్ష్యం, తమ అధినేత లక్ష్యం ఒకటే అని.. రాష్ట్రంలో రైతులు రాజులు కావాలన్నదే తమ కల అని తెలియ జేశారు. అందులో భాగంగానే ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ ఏర్పాటు చేశామ‌ని అన్నారు. రైతులు రాజులు కావాలనే ఉద్దేశ్యంతో రాష్ర్టంలో కేసీఆర్‌(KCR) చేసిన పనులు ఆద‌ర్శంగా నిలిచాయన్నారు. కూరగాయ‌ల‌ సాగు చేసే రైతులకు ఉపయోగపడేందుకు మల్కాజ్‌గిరి ఎమ్మేల్యే రాజశేఖర్‌రెడ్డి(Malkajgiri MLA Rajashekhar Reddy) గతంలో కృషి చేసి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు నిధులు మంజూరీ చేయించేందుకు పాటుపడ్డాడని తెలిపారు.

ఈ యూనిట్ కూరగాయల రైతుల‌కు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందులో కూరగాయలను ప్రాసెస్‌ చేయడంతో పాటు ప్యాకింగ్‌ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని, అదే విదంగా టమాట సాస్‌ తయారు చేసుకుని రైతులు అధిక లాభాన్ని పొందడానికి వీలుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధూకర్‌రెడ్డి, పూడూర్‌ సొసైటీ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, మేడ్చల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ రణదీప్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ బాబు యాదవ్‌, నాయకులు నర్సింహరెడ్డి, నాగరాజు, సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story