- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుండెపోటుతో ఎంపీడీవో మృతి..
by Mallepaka Hamsa |
మేడ్చల్ జిల్లా, కీసర మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కె.రమాదేవి(55) గుండెపోటుతో మృతి చెందారు.

X
దిశ ప్రతినిధి,మేడ్చల్: మేడ్చల్ జిల్లా, కీసర మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కె.రమాదేవి(55) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లోని కొత్తపేట, వనస్థలిపురంలో నివసించే ఆమె ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురవగా,కుటుంబీకులు ఆమెను మలక్ పేట యశోద ఆసుపత్రిలో తీసుకెళ్లారు. అప్పటికే గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గతంలో మేడ్చల్ లో ఎంపీడీవో గా పనిచేసిన ఆమె, ఆర్నెల్ల క్రితం కీసరకు బదిలీపై వచ్చారు. ఆమెకు ఒక కొడుకు,కుమార్తె ఉన్నారు..కాగా సోమవారం కీసర మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఆమెకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.
Next Story






