Chamakura Malla Reddy : బోనాల వేడుకల్లో చిందులేసిన మల్లారెడ్డి

by Batti.Sumithra |   (  Updated:2025-08-04 05:49:53  IST  )

ఘట్కేసర్లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హల్చల్ చేశారు.

Chamakura Malla Reddy : బోనాల వేడుకల్లో చిందులేసిన మల్లారెడ్డి
X

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హల్చల్ చేశారు. పట్టణ కేంద్రంలో ఆదివారం రాత్రి గౌడ సంఘం అధ్యక్షుడు మదనగిరి సురేష్ గౌడ్, మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై ఫలహారం బండి వద్ద అమ్మవారికి పూజలు చేశారు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బోనాల పాటకు చిందులు వేశారు. పాలమ్మినా.. పూలమ్మినా.. నెంబర్ వన్ గా అన్ని రంగాల్లో ఉన్నా అని మల్లారెడ్డి మాటలకు యువత కేరింతలు కొట్టారు. యువత కూడా అన్ని రంగాల్లో రాణించాలని నెంబర్వన్ గా ఉండాలని ఆకాంక్షించారు.

Next Story