వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

by velandi.Saikiran |

నియోజక వర్గ పరిధిలోని ముంపున‌కు గురయ్యే పలు ప్రాంతాల్లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు

వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
X

దిశ, నాచారం: నియోజక వర్గ పరిధిలోని ముంపున‌కు గురయ్యే పలు ప్రాంతాల్లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ కాలనీలో రూ. 60 లక్షల వ్యయం తో చేపట్టిన వరద నీటి ప్రవాహం కొరకు శాశ్వత పరిష్కారం దిశగా డ్రైన్ బాక్స్ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి పూజలు నిర్వ హించిన అనంతరం కొబ్బ రికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజ కవర్గ పరిధిలో వరద నీటితో ముంపునకు గురయ్యే కాలనీలను గుర్తించనున్నట్లు చెప్పా రు. శాశ్వత పరిష్కారం దిశగా దశలవారీగా పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాప్రా మున్సిపాలిటీ ఇంజనీరింగ్ డిఈ రూపా, ఏ ఈ శ్రవంతి, స్థానిక కాలనీ ప్రతినిధులు, పరమేష్ రెడ్డి, మధు, రమేష్, ప్రతాప్ రెడ్డి, అశోక్ రెడ్డి, సోమయ్య, సారంగపని నాయకులు తండా వాసుదేవ్ గౌడ్, బోదాసు లక్ష్మీనారాయణ, కుంటి కృష్ణ, రాపోలు సతీష్, చిన్న దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story