ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

by Batti.Sumithra |

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
X

దిశ, కాప్రా : ఆటో డ్రైవర్ల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈసీఐఎల్‌లోని సెవెన్ సీటర్స్ ఆటో యూనియన్ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి నూతన కమిటీని పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ఆటో స్టాండ్లకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని, దీంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు.

అలాగే ఆటో డ్రైవర్లకు భద్రత లేకుండా పోయిందని పేర్కొంటూ ఇతర సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. అలాగే ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేష్ గౌడ్, ఈసీఐఎల్ ఆటో యూనియన్ నూతన కమిటీ సభ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Next Story