మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

by Kodari Anjali |

మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉప్పల్ ఎమ్మెల్యే కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే
X

దిశ, నాచారం: మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్‌తో కలిసి పర్యటించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా ఇతర మౌలిక వసతుల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శ్రద్ధగా విన్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే డ్రైనేజీ, విద్యుత్ ఇతర స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసి తక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, కాలనీ అధ్యక్షులు వాసు చారి, కార్యదర్శి మధు ముదిరాజ్, స్థానిక నాయకులు భానూరి రాకేష్, రిజ్వాన్, నరేష్, శ్రీకాంత్ గౌడ్, భీష్మాచారి, యాదయ్యతో పాటు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story