- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిశుధ్య కార్మికుల పని సమయాలలో స్వల్ప మార్పులు
by velandi.Saikiran |
పారిశుధ్య కార్మికుల పని సమయాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.
X
దిశ, ఉప్పల్ : పారిశుధ్య కార్మికుల పని సమయాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రత ప్రమాణాల నేపథ్యంలో పని గంటలలో స్వల్ప మార్పులు చేయాలని మల్కాజిగిరి నగరపాలక సంస్థ కమిషనర్ టి వినయ్ క్రిష్ణారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 5 నుంచి 6 గంటలు, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య హాజరు నమోదు చేసుకోవాలన్నారు. నిన్నటి వరకు మధ్యాహ్న హాజరు నమోదు మధ్యాహ్నం 1- 2 గంటల మధ్య ఉండేది. ఎండాకాలం నేపథ్యంలో ఇప్పుడు ఒక గంట ముందుగానే (12PM - 1PM) హాజరు నమోదు చేస్తారని పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్ సియన్ రఘుప్రసాద్ తెలిపారు.
Next Story






