- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన మేడ్చల్ జిల్లా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జిల్లా వ్యాప్తంగా 95.24 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఐ . విజయ కుమారి బుధవారం పది ఫలితాల పూర్తి వివరాలను వెల్లడించారు. జిల్లాలోని 903 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు అని, జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ విధానంలో మొత్తం 48,855 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 46,531 మంది విద్యార్థులు విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు అని తెలిపారు. దీంతో జిల్లా మొత్తం ఉత్తీర్ణత శాతం 95.24 గా నమోదైంది.
కొనసాగిన బాలికల హవా
ప్రతి ఏడాదీ మాదిరిగానే ఈసారి కూడా పది ఫలితాల్లో బాలికలదే ఆధిపత్యం కొనసాగింది. బాలుర కంటే మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసి బాలికలు తమ సత్తా చాటారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 25,393 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా.. అందులో 23,955 మంది పాసయ్యారు. వీరి ఉత్తీర్ణత శాతం 94.34 గా ఉంది. ఇక బాలికల విషయానికి వస్తే మొత్తం 23,462 మంది పరీక్షలు రాయగా.. ఏకంగా 22,576 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం (96.22%) దాదాపు రెండు శాతం మేర అధికంగా నమోదు కావడం విశేషం. జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.






