- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 2002 నుంచి ఉన్న ఓటరు జాబితాను 2025కి అనుగుణంగా సవరించే మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 2002 నుంచి ఉన్న ఓటరు జాబితాను 2025కి అనుగుణంగా సవరించే మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. తదుపరి సమావేశం నాటికి ఈ ప్రక్రియలో పురోగతి కనిపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు ఫైజన్ అహ్మద్, విజయేందర్ రెడ్డిలతో కలిసి ఆయన డీసీలు, ఏఆర్ఓలు, ఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బీఎల్‌ఓలకు జాబితాలను కేటాయించేటప్పుడు ఒక చోట ఎక్కువ, మరో చోట తక్కువ కాకుండా ఇంచుమించు సమానంగా ఉండేలా చూడాలని సూచించారు. మ్యాపింగ్ ప్రక్రియ 10-20 శాతం కంటే తక్కువగా ఉన్న చోట శాతం పెంచేందుకు తహశీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి, వెరిఫికేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.






