- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకు, కూతురు కన్నా..కేసీఆర్ కు ప్రజలే ముఖ్యం
మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కు కొడుకు, కూతురు కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యం అని, ఆయన ఓ యుగ పురుషుడు అని మేడ్చల్

దిశ, తిరుమలగిరి: మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కు కొడుకు, కూతురు కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యం అని, ఆయన ఓ యుగ పురుషుడు అని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బోయినపల్లి చెక్ పోస్ట్ వద్ద విగ్నేశ్వర లారీ అసోసియేషన్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో బుధవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గత 30సంవత్సరాలుగా అసోసియేషన్ పూజా కార్యక్రమాలు చేస్తోందన్నారు.
పార్టీని ఎవరు ధిక్కరిస్తే వారిని సస్పెండ్ చేయవలిసిందేనని మరో అవకాశం ఉండదనన్నారు. గులాబీ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. కెసిఆర్ లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణకు నాయకుడిగా ఉండడం మనందరి అదృష్టమని వెల్లడించారు. కాలేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలా ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ పూజా కార్యక్రమాలలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్,ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్,కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.






