ధనిక తెలంగాణను దరిద్ర రాష్ట్రంగా మార్చారు - మల్లారెడ్డి

by velandi.Saikiran |

బుధవారం మున్సిపల్ పరిధిలోని ఎల్లంపేట, లింగాపూర్ వార్డులో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ధనిక తెలంగాణను దరిద్ర రాష్ట్రంగా మార్చారు - మల్లారెడ్డి
X

దిశ,మేడ్చల్ : ధనిక తెలంగాణను దరిద్ర రాష్ట్రంగా మార్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది” అంటూ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని ఎల్లంపేట, లింగాపూర్ వార్డులో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీలత రమేష్, 11వ వార్డు అభ్యర్థి అఖిల సాయి కుమార్, 24వ వార్డు అభ్యర్థి నవనీత రమేష్, లింగాపూర్ పరిధిలోని 15వ వార్డు అభ్యర్థి కోర్పతి సత్తయ్యలకు అభ్యర్ధులను ప్రకటించారు .ఈ సందర్భంగా మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జీ లక్ష్మారెడ్డి, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రాజమల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Next Story