- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటుకు నోటు.. అడ్డంగా దొరికిన మల్లారెడ్డి కళాశాల సిబ్బంది
by Batti.Sumithra |
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో డబ్బులు పంచుతూ మల్లారెడ్డి కళాశాల సిబ్బంది, విద్యార్థులు దొరికిపోయారు.

X
దిశ, మేడిపల్లి : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో డబ్బులు పంచుతూ మల్లారెడ్డి కళాశాల సిబ్బంది, విద్యార్థులు దొరికిపోయారు. ఈ సంఘటన మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో జరిగింది. కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి మండలం పిర్జాదిగూడ బోడుప్పల్ కమాన్ వద్ద మల్లారెడ్డి కే ఓటు వేస్తామని బైబిల్ పై ప్రమాణం చేపిస్తూ ఓటర్లకు డబ్బు పంచుతూ మల్లారెడ్డి కళాశాల సిబ్బంది, విద్యార్థులు కాంగ్రెస్ నాయకులకు పట్టుబడ్డారు.
దీంతో కాంగ్రెస్ నాయకులు వారిని సంబంధిత అధికారులకు అప్పగించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటమి భయంతో ప్రలోభాలకు తెరలేపిన మంత్రి మల్లారెడ్డి, ఓట్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారని, మంత్రి మల్లారెడ్డి నిజంగానే అభివృద్ధి చేస్తే ఈ ప్రలోభాలు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
Next Story






