- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > పీర్జాదిగూడలో డబ్బు పంచుతూ అడ్డంగా దొరికిన మల్లా రెడ్డి కాలేజ్ సిబ్బంది (వీడియో)
పీర్జాదిగూడలో డబ్బు పంచుతూ అడ్డంగా దొరికిన మల్లా రెడ్డి కాలేజ్ సిబ్బంది (వీడియో)
మల్లా రెడ్డి కళాశాల సిబ్బంది డబ్బు పంచుతుండగా కాంగ్రెస్ నాయకులుకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మల్లికార్జున నగర్ వద్ద చోటు చేసుకుంది.

X
దిశ, మేడిపల్లి: మల్లా రెడ్డి కళాశాల సిబ్బంది డబ్బు పంచుతుండగా కాంగ్రెస్ నాయకులుకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మల్లికార్జున నగర్ వద్ద చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లికార్జున నగర్‌లో ఓ మహిళా ముగ్గురు పురుషులు కలిసి మల్లా రెడ్డిని గెలిపించాలంటూ ఓటరు లిస్ట్ పట్టుకుని ఇంటింటికి తిరుగుతు డబ్బులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పీర్జాదిగూడలో డబ్బు పంచుతున్నట్లు సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు మహిళా వద్ద ఉన్న డబ్బు స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు అప్పగించారు. ఓటమి భయంతోనే మల్లా రెడ్డి ఇలాంటి ప్రలోభాలకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
Next Story






