బడా బిల్డర్ బరితెగింపుపై స్థానికుల ఫిర్యాదు..

by Kodari Anjali |

అక్రమ నిర్మాణమని తేలడంతో నిర్మాణదారులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బడా బిల్డర్ బరితెగింపుపై స్థానికుల ఫిర్యాదు..
X

దిశ, దుండిగల్: అక్రమాలకు అలవాటుపడితే చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అనుమతులు లేని నిర్మాణాలు ఎప్పటికైనా కూలిపోవచ్చు అని దుండిగల్-గండిమైసమ్మ మండల రెవెన్యూ అధికారులు ని రూపించారు. మండల పరిధిలోని గాగిల్లపూర్ కోతినార్ చెరువును చెరబట్టిన కబ్జాదారులు కాసా గ్రాండ్ సీఎర్రా పేరుతో కోతినార్ చెరువు కట్టను ధ్వంసం చేసి ప్రైవేట్ వెంచర్ కోసం అప్రోచ్ రోడ్డు నిర్మాణంతోపాటు నాలుగు లైన రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్థానికుల ఫి ర్యాదు, మే19న దిన పత్రికల్లో వార్తా కథనాలు వెలువడంతో స్పం దించిన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు జూన్ 1న జాయింట్ సర్వే నిర్వహించాయి. అక్రమ నిర్మాణం అని తేలడంతో నిర్మాణ సంస్థకు రెవె న్యూ నోటీసులు జారీ చేశారు. చెరు వు కట్టను ధ్వంసం చేసిన ప్రాంతా న్ని జూన్ 2న ఎక్స్ కవేటర్ తో అధికారులు పూర్తిగా లెవల్ చేశారు.

ప్రమాదకర స్థితికి చెరువు కట్ట..

చెరువు కట్ట కింద నిర్మాణాలు చేపట్టాలంటే చెరువు కట్ట నుంచి 9 మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు. కాసా గ్రాండ్ నిర్మాణ సంస్థ కాసా గ్రాండ్ సీఎర్రా పెరుతూ కోతినార్ చెరువు కట్టను ఏకం గా సగం కట్టను ధ్వంసం చేసి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి తెరలేపడంతోపాటు కట్ట నుంచి ఆప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టింది. సుమా రు 45 ఏకరాల్లో విస్తరించిన కోతి నార్ చెరువు గాగిల్లపూర్ గ్రామానికి ప్రధాన జలాసాయంతోపాటు, కట్ట కింద వరి సాగు చెస్తూ రైతులు ఆధారపడ్డారు. చెరువును చెరబట్టిన కేటుగాళ్లు కట్టను ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణం చేపడుతుండడంతో కట్ట ప్రమాదంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన జలాశయాలు కబ్జాకు గురవకుండా హైడ్రా అధికారులు నిఘా నియంత్రణలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నా బరితెగిస్తున్న బడా నిర్మాణ సంస్థలు చెరువు కట్టను ధ్వంసం చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుండడం పలు అనుమానాలకు తావి స్తోంది. అక్రమ సంపాదనకు అల వాటు పడ్డ కింది స్థాయి ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల కను సన్నల్లోనే సదరు సంస్థలు రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

క్రిమినల్ కేసు...

కాసా గ్రాండ్ నిర్మాణ సంస్థ కట్టను ధ్వంసం చేసి నిర్మాణాలు చేపట్టడంతో జాయింట్ సర్వే నిర్వహించామని తహశీల్దార్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. సర్వే ఆధారంగా దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. క్రిమినల్ కేసులతోపాటు చెరువు కట్ట ధ్వంసాన్ని అంచనావేసి పునరుద్దరణపై చర్యలు చేపడుతామన్నారు.

సర్వే రిపోర్ట్ ఆలస్యంపై అనుమానాలు?

ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే రిపోర్ట్ ఆలస్యంగా పంపడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువు కట్టను చేరబట్టిన కాసా గ్రాండ్ నిర్మాణ సంస్థ కట్ట మీద ప్లెక్సీల ఏర్పాటు, కట్ట మీది నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణం, చెరువు కట్టను ధ్వంసం చేసి వెంచర్ కోసం 4 లైన్ల రోడ్డుకు తెరలేపడంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జూన్ 1న జాయింట్ సర్వే నిర్వహించారు. జాయింట్ సర్వే రిపోర్ట్ ను ఇరిగేషన్ అధికారులు వారంలో రెవెన్యూ అధికారులకు పంపాల్సి ఉంటుంది. జాయింట్ సర్వే రిపోర్ట్ ఆధారంగా రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడతారు. జాయింట్ సర్వే నిర్వహించిన 22 రోజులకు ఇరిగేషన్ అధికారులు సర్వే రిపోర్ట్ పంపడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ఇరిగేషన్ అధికారులు సర్వే రిపోర్ట్ పంపడలో ఆలస్యం చేశారన్న విమర్శలున్నాయి.

Next Story