- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీఐ నాగరాజుపై సిట్ సీరియస్ విచారణ.. బలపడుతున్న అనుమానాలు?
గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో అరెస్ట్ అయిన సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సుదీర్ఘంగా విచారిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో అరెస్ట్ అయిన సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సుదీర్ఘంగా విచారిస్తోంది. నిన్న (జూన్ 23) అజిత్‌సింగ్ నగర్‌లో సీఐని అదుపులోకి తీసుకున్న అధికారులు.. సాయికృష్ణ అదృశ్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, స్వయంగా ఐజీ రంగంలోకి దిగి విచారించినా సీఐ నాగరాజు నోరు మెదపకపోవడం, సమాధానాలు దాటవేస్తుండటంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది.
విచారణలో సిట్ ప్రధాన ప్రశ్నలు..?
నాన్ బెయిలబుల్ వారెంట్ పేరుతో సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు ఎందుకు తీసుకొచ్చారు? ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారు? ఇందులో కృష్ణలంక పీఎస్ సిబ్బంది పాత్ర ఎంత? పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారు? అని సిట్ విచారణలో అధికారులు ప్రశ్నల వర్షం కురింపించినట్లు తెలుస్తోంది. ఐజీ స్థాయి అధికారి స్వయంగా ప్రశ్నించినప్పటికీ సీఐ నాగరాజు సహకరించలేదని, కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేశారని సమాచారం.
లాకప్ డెత్ అనుమానాలు..?
సీఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం, సాయికృష్ణ ఆచూకీ దొరకకపోవడం, ఫుటేజ్ మాయమవ్వడం వంటి పరిణామాలు ఇది ‘లాకప్ డెత్’ అన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. నేడు సీఐ నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో, కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.






