- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్.. జనసేనలో చేరికల కోసం ప్రత్యేక జాయినింగ్స్ కమిటీ
జనసేన పార్టీ.. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో జనసేన పార్టీ తన రాజకీయ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తూ ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా మారిన జనసేన పార్టీ (Janasena Party).. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో జనసేన పార్టీ తన రాజకీయ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది. పార్టీ భావజాలానికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి చేరాలనుకునే నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను ఆహ్వానించేందుకు, ఆ చేరికలను క్రమబద్ధంగా సమన్వయం చేసేందుకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక "తెలంగాణ జాయినింగ్స్ కమిటీ(Telangana Joinings Committee)ని నియమించింది. ఈ కమిటీలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డా. గడల శ్రీనివాస్ (Ex తెలంగాణ రాష్ట్ర మెడికల్ డైరెక్టర్), గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, మేడూరి సరస్వతి (Ex తెలంగాణ రాష్ట్ర DCP) సభ్యులుగా వ్యవహరించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వస్తున్న చేరికల విజ్ఞప్తులను ఈ జాయినింగ్స్ కమిటీ మొదట క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పరిశీలించి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం ఆయన ఇచ్చే దిశా నిర్దేశం, కీలక సూచనల మేరకు తెలంగాణలో భారీ ఎత్తున చేరికల కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ తాజా కమిటీ ఏర్పాటుతో తెలంగాణలో జనసేన పార్టీ క్షేత్రస్థాయి బలోపేతం పై ప్రత్యేక దృష్టి సారించి, రాజకీయంగా స్పీడ్ పెంచిందని స్పష్టమవుతోంది.






