Excise permits : ఎక్సైజ్‌ అనుమతులు లేకుండా మద్యం పార్టీలు నిర్వహించ కూడదు..

by Batti.Sumithra |

ఎక్సైజ్‌ అనుమతులు లేకుండా ఎలాంటి మద్యం పార్టీలు నిర్వహించకూడదని రాష్ట్రఎక్సైజ్‌ ఎన్ఫోర్స్మెంట్ మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

Excise permits : ఎక్సైజ్‌ అనుమతులు లేకుండా మద్యం పార్టీలు నిర్వహించ కూడదు..
X

దిశ, ఘట్కేసర్ : ఎక్సైజ్‌ అనుమతులు లేకుండా ఎలాంటి మద్యం పార్టీలు నిర్వహించకూడదని రాష్ట్రఎక్సైజ్‌ ఎన్ఫోర్స్మెంట్ మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం అంకుషాపూర్‌లోని ది కాంటినెంటల్‌ రిసార్ట్‌లో సోమవారం అర్ధరాత్రి బర్త్‌ డే పార్టీ నిర్వాహణకు ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా పలువురు బుల్లితెర నటీనటులు హాజరై పోలీసులకు నిలువునా బుక్కయ్యారు. ఈ ఘటన పై కమలహాసన్ రెడ్డి స్పందిస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బర్త్‌ డే పార్టీ నుంచి అనేక శుభకార్యక్రమాలకు మద్యం వినియోగం ఒక భాగమై పోయింది. పార్టీలకు రూ. లక్షలు ఖర్చు చేస్తారు. కాని ఎక్సైజ్‌నుంచి మద్యం వినియోగానికి అనుమతులు తీసుకోకుండా నిర్వాహకులు, అథిత్యం ఇచ్చె రిసార్ట్‌ల యాజమానులు ఎక్సైజ్‌ పోలీసుల దాడులలో పట్టుబడుతున్నారు. రెండు రోజుల క్రితం బిగ్‌బాస్‌ ఫేమ్ మహబూబ్‌ తన బర్త్‌ డేను ఘట్కేసర్ అంకుషాపూర్‌లో ఉన్నది కాంటినెంటల్‌ రిసార్ట్‌లో ఏర్పాటు ఏర్పాటు చేసుకుని 20 మంది పై బుల్లితెర నటీనటులు, మరికొందరు వీఐపీలను ఆహ్వానించారు.

కానీ పార్టీ నిర్వహణకు అవసరమైన ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతి లేక పోవడంతో ఎక్సైజ్‌ పోలీసులు రిసార్ట్‌ పై దాడులు నిర్వహించి అనుమతి లేకుండా వినియోగిస్తున్న మద్యం స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు షేక్‌ సుబానీ, రిసార్ట్‌ యజమాని కోల సుధీర్‌ కుమార్ పై ఎక్సైజ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల, దేశాల నుంచి అనుమతి లేని మద్యం (నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్) వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్‌ శాఖ నిత్యం దాడులు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లో అనుమతులు లేకుండా వీదేశీ మద్యం, డ్రగ్స్‌ను వినియోగించే రేవ్‌ పార్టీని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. నిత్యం ఎక్సైజ్‌ పోలీసులు, ప్రత్యేక బృందాలు ఉంటాయని, పార్టీ నిర్వహించుకోవడానికి ఎక్సైజ్‌ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ అనుమతించిన మద్యాన్ని మాత్రమే వినియోగించాలని, డ్రగ్స్‌ వినియోగించ కూడదాని కమలహాసన్ రెడ్డి సూచించారు.

Next Story