- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడుదాం : మాల సంక్షేమ సంఘం నాయకులు
దిశ, దమ్మాయిగూడ : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాజీవ్ గృహకల్ప కాలనీ మాల సంక్షేమ సంఘం

దిశ, దమ్మాయిగూడ : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాజీవ్ గృహకల్ప కాలనీ మాల సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానానికి ప్రతీకగా వారం వారం పూలహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం 199వ వారాన్ని పూలహారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్జికే కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముద్దసాని నరేష్ కుమార్ హాజరై ఆ మహా నాయుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకుపోదాం అని అన్నారు. కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు మేడ్చల్ జిల్లా కన్వీనర్ గుజ్జుక పరశురాం, ఆర్జీకే కాలనీ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాట రాజు, అధ్యక్షుడు అబ్బులు, ఆర్ జీ కే కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు రాములు, మాజీ అధ్యక్షుడు, ఆర్జీకే కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మోతే రాజేంద్ర ప్రసాద్, మాల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోలాటి రాజు, ఆర్ జీ కే కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ, గ్యాస్ వెంకటేశ్, పోతుల వెంకటేశ్వర రావు, పెద్దలు కనకరాజు, కాలనీ లోని సభ్యులు పాల్గొన్నారు.






