లంచాలు డిమాండ్ చేయ‌డంలో కూక‌ట్ ప‌ల్లి జోన్ టాప్

by Ratna Kumari |

కూకట్​పల్లి జోన్​ ప్రతి సారి ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా సైబ‌రాబాద్ ​ మున్సిపల్​ కార్పొరేషన్​గా ఏర్పడిన కూకట్​పల్లి జోన్​ ఎల్లప్పుడు అవినీతి అధికారుల ద్వారా వార్తలలోకి ఎక్కుతూనే ఉంటుంది.

లంచాలు డిమాండ్ చేయ‌డంలో కూక‌ట్ ప‌ల్లి జోన్ టాప్
X

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి జోన్​ ప్రతి సారి ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా సైబ‌రాబాద్ ​ మున్సిపల్​ కార్పొరేషన్​గా ఏర్పడిన కూకట్​పల్లి జోన్​ ఎల్లప్పుడు అవినీతి అధికారుల ద్వారా వార్తలలోకి ఎక్కుతూనే ఉంటుంది. దొరికితే దొంగలం, దొరకనంత వరకు దొరలమే కదా అన్న సిద్దాంతాన్ని పాటిస్తన్నట్టు ఉన్నారు కూకట్​పల్లి జోన్​లోని ఆయా సర్కిళ్ల అధికారులు. గత 6 నెలల కాలంలోనే అవినీతి నిరోధక శాఖ అధికారుల బాధితుల నుంచి డబ్బులు లంచంగా తీసుకుంటుండగా ముగ్గురినీ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వరుసగా ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నా.. అధికారుల‌కు క‌నీసం చీమ కుట్టునట్టు కూడా లేదు. ఎంతో కాలంగా పాతుకు పోయి ఒకే స్థానంలో పని చేస్తూ స్థాన చలనం లేక పోతుండటంతోనే ఏ స్థాయి పైరవీలకైనా సిబ్బంది, అధికారులు యధేచ్చగా తమ జేబులను నింపుకునేందుకు సిద్దంగా ఉంటున్నారు.

సర్కిల్​ స్థాయి నుంచి జోనల్​ స్థాయి వరకు ఎటువంటి పని ఉన్న సరే ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులే చక్క బెడుతారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కూకట్​పల్లి జోన్​ పరిధిలో ప్రధానంగా ఉన్న కూకట్​పల్లి, మూసాపేట్​ సర్కిళ్ల పరిధిలో అన్ని విభాగాలలో పని చేస్తున్న అటెండర్లు, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులు, డ్రైవర్​లు, ఇంజనీరింగ్​, టౌన్​ ప్లానింగ్​, పారిశుధ్య విభాగం, ఎంటమాలజి, రెవెన్యు, యూసీడి విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు గత రెండు దశాబ్దాలుగా ఇదే ప్రాంతంలో, ఇవే సర్కిళ్లలో పని చేస్తున్నారు. కూకట్​పల్లి, మూసాపేట్​ సర్కిళ్లతో పాటు జోనల్​ కమీషనర్​ కార్యాలయం సైతం ఒకే భవనంలో కొనసాగుతుంది. దశాబ్దాలుగా ఒకే స్థానంల, ఒకే ప్రాంతంలో పని చేస్తుండటంతో రెండు సర్కిళ్లతో పాటు, జోనల్​ కార్యాలయంలో అన్ని పనులలో పైరవీలు చేస్తూ సిబ్బంది, అధికారులు చక్రం తిప్పుతున్నార‌నే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లుగా ఒకే చోట పాతి పెట్టుకుని ఉన్న అధికారులు, సిబ్బందికి స్థానచలనం చేసే వరకు కూకట్​పల్లి జోన్​లో అవినీతి కంపు పోదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


గత నెల రోజుల క్రితం ఫిబ్రవరి నెలలో కుత్బుల్లాపూర్​ సర్కిల్​లో రెవెన్యూ ఇన్ స్పెక్ట‌ర్ ​ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టు బడ్డాడు. ఏసీబీ సోదాల్లో కూకట్​పల్లి సర్కిల్​ పరిధిలో జరగుతాయనే రూమ‌ర్స్ రావడంతో సర్కిల్​లో టౌన్​ ప్లానింగ్​ విభాగంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి రెండు రోజలు అకస్మాత్తుగా సెలవు పెట్టి విధులకు హాజరు కాకుండా వెళ్లినట్టు సమాచారం. కూకట్​పల్లి, మూసాపేట్​ సర్కిళ్ల​ పరిధిలోని టౌన్​ప్లానింగ్​, ఇంజనీరింగ్​, రెవెన్యూ విభాగాలలో ఎక్కువ శాతం అవినీతి జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కూకట్​పల్లి జోన్​ పరిధిలోని కూకట్​పల్లి, మూసాపేట్​ జంట సర్కిళ్లతో పాటు గతంలో విభజనకు ముందు ఉన్న కుత్బుల్లాపూర్​, అల్వాల్​, గాజులరామారం సర్కిళ్లతో కూడిన జోన్​ ఉన్న సమయంలోనే ఏసీబి అధికారులకు పట్టు బడిన కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఓ స్వచ్చ ఆటో కార్మికుడి నుంచి లక్ష రూపాయలు డిమాండ్​ చేస్తూ ఓ ఎస్​ఆర్​పి ఏసీబి అధికారులకు పట్టు బడ్డాడు. టౌన్​ ప్లానింగ్​ విభాగంలోను పలువురు లంచం తీసుకుంటుండగా.. పట్టు బడిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా గత ఆరు నెలల కాలంలో జరిగిన మూడు సంఘటనలు జ‌రిగాయి.

మార్చి 10, 2026 తాజాగా కూకట్​పల్లి జోన్​ పరిధిలోని మూసాపేట్​ సర్కిల్​ మూసాపేట్​ డివిజన్​ కమ్యునిటి ఆర్గనైజర్​గా పని చేస్తున్న మురళి పొదుపు సంఘాల మహిళలకు లోన్​ ఇప్పించడానికి వారి నుంచి 18 వేలు లంచం డిమాండ్​ చేసి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఫిబ్రవరి 4, 2026న కూకట్​పల్లి జోన్​లో ఏస్​ఈగా పని చేస్తున్న చెన్నారెడ్డి ఓ కాంట్రాక్టర్​ వ‌ద్ద నుంచి 1.40 కోట్ల బిల్లులు విడుదల చేయాలంటే రూ.30 లక్షలు లంచం డిమాండ్​ చేసి రూ.15 లక్షలు నగదు కంప్యూట‌ర్ ​ ఆపరేట్​ ప్రవీణ్​ ద్వారా తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

జులై 1, 2025 న మూసాపేట్​ సర్కిల్​ రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్​గా పని చేస్తున్న సునిత ఓ వ్యక్తి నుంచి మ్యూటేషన్​ చేయడానికి రూ.80 వేలు లంచం డిమాండ్​ చేసి రూ.30 వేల రూపాయలు నగదు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఇలా నిత్యం కూక‌ట్ ప‌ల్లి జోన్ లో ఏబీసీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డటం సంచ‌ల‌నంగా మారింది.

Next Story