Kapra: అక్రమ నిర్మాణాలకు అడ్డాగా కాప్రా సర్కిల్

by Ramesh Goud |

కాప్రా సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో నిబంధనలను ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Kapra: అక్రమ నిర్మాణాలకు అడ్డాగా కాప్రా సర్కిల్
X

దిశ, కాప్రా : కాప్రా సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో నిబంధనలను ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాప్రా, ఏఎస్ రావునగర్, చర్లపల్లి , మీర్పేట్ హెచ్చీకాలనీ, నాచారం, మల్లాపూర్ డివిజన్ల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్ముకై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, పద్మశాలి టౌన్ షిప్, హెబ్బీకాలనీ, మల్లాపూర్ ప్రాంతాల్లోని పలు కాలనీల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జమ్మిగడ్డ సమీపంలోని శ్రీనగర్ కాలనీ, హరిత ఎన్ క్లేవ్ లో నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. చర్లపల్లి డివిజన్‌లో నాలా సమీపంలోనే అనుమతులు లేకుండా షెటర్ల నిర్మాణం కొనసాగుతుంది. సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణాలపై పర్యవేక్షణ లోపించడంతో నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story