- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలిక పై అసభ్య ప్రవర్తన... వృద్ధుడి పై పోక్సో కేసు నమోదు
by Ratna Kumari |
మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ , కాప్రా : మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల మైనర్ బాలిక కిరాణా దుకాణానికి వెళ్లగా.. ఇస్త్రీ షాపు నిర్వహించే ముడికొండ లింగం (75) బాలికను తన షాపులోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయం చుట్టుపక్కల వారు చూసి బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బాలిక స్టేట్ మెంట్ ని రికార్డ్ చేసి వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Next Story






