- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట ఘరానా మోసం
డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని ఒక మహిళా మోసం చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ,ఉప్పల్: డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని ఒక మహిళా మోసం చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామంతాపూర్ చర్చి కాలనీకి చెందిన మరియమ్మ(50), అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని డబుల్ బెడ్ రూమ్స్, ప్రభుత్వ ప్లాట్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపి సుమారు 80 మంది వద్ద కోటి ఎనభై లక్షల రూపాయలు కాజేసినట్లు బాధితులు తెలిపారు.
తన ఇంటి సమీపంలో ఉన్న చర్చికి వస్తూ వెళ్తూ ఉండేది. 2023 నుంచి 2024 వరకు రోజు చర్చికి వస్తున్న మహిళలను టార్గెట్ గా చేసుకుని నా బంధువు కలెక్టర్ అని చెప్తూ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రభుత్వ ప్లాట్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి ఫోన్ పే, క్యాష్ రూపంలో, ఆన్లైన్ రూపంలో డబ్బులు తీసుకుందని బాధితులు తెలిపారు. మరియమ్మ ఏదో సాకు చూపుతూ కాలాన్ని గడిపేయడంతో మోసాన్ని బాధితులు గుర్తించారు. ఉప్పల్ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి మరియమ్మ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






