మందుబాబులకు కేరాఫ్ అడ్రస్ గా ఫంక్షన్ హాల్?

by Ramesh Goud |

అప్పటి మాజీ సీఎం కేసీఆర్ మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం, నాగిశెట్టిపల్లి, లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, లింగాపూర్ తండా, గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

మందుబాబులకు కేరాఫ్ అడ్రస్ గా ఫంక్షన్ హాల్?
X

దిశ, శామీర్ పేట్: అప్పటి మాజీ సీఎం కేసీఆర్ మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం, నాగిశెట్టిపల్లి, లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, లింగాపూర్ తండా, గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయా గ్రామాల అభివృద్ధికి రూ. 66 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు.

సీఎం ఆదేశాలతో..

అప్పటి మాజీ సీఎం ఆదేశాలతో అధికారులు పర్యవేక్షించారు. కాంట్రాక్టర్లు ఆగ మెఘాలమీద పనులు పూర్తి చేశారు. పనులు మాత్రం పూర్తి చేశారు. కానీ ప్రారంభోత్సవానికి మాత్రం కొద్ది కాలం వరకు నోచుకోలేదు 2022 ఎన్నికల కోడ్ వస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి హడావుడిగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు.

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో..

మూడు చింతలపల్లి మండల కేంద్రంలో నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి వచ్చిన వసతులు కరువవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. గ్రామాలకు దూరంగా ఈ భవనాలు నిర్మించడంతో తాగుబోతులకు అడ్డగా మారింది. ఫంక్షన్ హాల్ లో నిర్మించిన విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్ వైర్లు పూర్తిగా ధ్వంసం చేశారు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన నిర్మాణంలో ఎటు చూసినా గాజు పింకలు, బీరు సీసాలు కాల్చిపడేసిన బీడీలు, సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. అటవీ ప్రాంతం కావడంతో గంజాయి కూడా పిలుస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు అంటున్నారు.

Next Story