- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు
గిరిజన యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గిరిజన అభివృద్ధి సంస్థ (ట్రైకోర్) మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణా కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్. పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : గిరిజన యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గిరిజన అభివృద్ధి సంస్థ (ట్రైకోర్) మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణా కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్. పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5న శామీర్‌పేట్ మండలం అంతాయిపల్లిలోని కలెక్టరేట్ ప్రజావాణి హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అపారెల్ మేడ్ అప్స్ అండ్ హోమ్ ఫర్నిషింగ్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్, ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్కిల్ ట్రైనింగ్ ఏజెన్సీల ద్వారా శిక్షణలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
శిక్షణా కోర్సుల్లో బ్యూటీ థెరపిస్ట్, బ్రైడల్ ఫ్యాషన్ అండ్ ఫోటో మేకప్ ఆర్టిస్ట్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, సీఆర్‌ఎం డొమెస్టిక్ నాన్‌వాయిస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్, ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేటర్, స్పెషలైజ్డ్ సివింగ్ మిషన్ ఆపరేటర్, డొమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ అటెండెంట్, వేర్‌హౌస్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెలికాం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్, ఇన్‌స్టోర్ ప్రమోటర్, హ్యాండ్ హెల్డ్ డివైజ్ టెక్నీషియన్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, వేర్‌హౌస్ సూపర్‌వైజర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం (ఎస్-30)లో ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటో, విద్యార్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9959159629 సంప్రదించాలని తెలిపారు.






