గ్యాస్‌ లీకై చెలరేగిన మంటలు

by Chintha Aamani |   (  Updated:2025-07-15 10:22:38  IST  )

ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగి టీవీతో పాటు ఇతర గృహోపకరణాలు కాలిపోయాయి.

గ్యాస్‌ లీకై చెలరేగిన మంటలు
X

దిశ,రాజేంద్రనగర్ : ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగి టీవీతో పాటు ఇతర గృహోపకరణాలు కాలిపోయాయి. ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మశాలి పురం సాయి కాలనీలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీలో ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన స్థానికంగా ఉండే ఓ యువకుడు ఇంట్లో నుంచి సిలిండర్ను బయటకు తీసుకొచ్చి దానిపై నీళ్లలో ఉంచిన బట్ట వేయడంతో మంటలు ఆరిపోయాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో టీవీ, ఇతర గృహోపకరణాలు కాలిపోయాయి. అయితే, ఇంటి యజమాని కొన్ని రోజులుగా సిలిండర్ రెగ్యులేటర్ పైప్ విరిగిపోగా దానికి ప్లాస్టిక్ టేప్ చుట్టి వినియోగించడం తో ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story