చిన్నపిల్లల మధ్య గొడవ...ఒక‌రు మృతి !

by velandi.Saikiran |

పిల్లల మధ్య జరిగిన గొడవలో తల్లిదండ్రులు తలదూర్చి ఒకరిపై ఒకరు ఘర్షణ పడ్డారు. ఈ సంఘ‌ట‌న‌లో ఒక వ్యక్తి మరణించారు. ఈ

చిన్నపిల్లల మధ్య గొడవ...ఒక‌రు మృతి !
X

దిశ, ఘట్కేసర్ : పిల్లల మధ్య జరిగిన గొడవలో తల్లిదండ్రులు తలదూర్చి ఒకరిపై ఒకరు ఘర్షణ పడ్డారు. ఈ సంఘ‌ట‌న‌లో ఒక వ్యక్తి మరణించారు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం అవుషాపూర్ కు చెందిన సయ్యద్ అమీర్ ఇంట్లో ఉండగా తన ఇంటి ముందు షన్ను పిల్లలు అసీనా, అజ్మెద్, సయ్యద్ అలీ కుమారుడు అబూ ఒకరితో ఒకరు గొడవ ప‌డ్డారు.

సయ్యద్ అమీర్ (34) గొడవ చేయవద్దని అబూతో చెప్పగా, ఆ బాలుడు ఇంటికి వెళ్లి తన తండ్రి సయ్యద్ అలీ చెప్పాడు. అతను, అక్కడికి వచ్చి సయ్యద్ అమీర్ తో గొడ‌వ‌ప‌డ్డాడు. ఇక గొడ‌వ ముగిసిన‌ అరగంట తర్వాత సయ్యద్ ఆమీర్, ఛాతీ నొప్పి, వాంతులు, చెమటలు పడుతున్నాయని చెప్పడంతో, అతన్ని ఘట్కేసర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. వైద్యులు అతడిని పరీక్షించి చనిపోయినట్లు తెలిపారు. సయ్యద్ అమీర్ మృతి పై అత‌ని భార్య సోని సోమవారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శవపరీక్ష నిమిత్తం శవాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story