- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లారెడ్డి, ఈటల రాజేందర్ ను కలిసిన రైతులు
ఘట్కేసర్ ఉమ్మడి మండల పరిధిలోని రైతులకు ప్రభుత్వం వెంటనే రైతు రుణమాఫీ చేయాలని రైతు రుణమాఫీ సాధన సమితి

దిశ, ఘట్కేసర్: ఘట్కేసర్ ఉమ్మడి మండల పరిధిలోని రైతులకు ప్రభుత్వం వెంటనే రైతు రుణమాఫీ చేయాలని రైతు రుణమాఫీ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం ఘట్కేసర్ రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో శివారెడ్డిగూడ హనుమాన్ దేవాలయం నుంచి రైతులు ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... ఘట్కేసర్ రైతు సేవా సహకార సంఘంలో సాగు పెట్టుబడుల నిమిత్తం సుమారు 1,189 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల వరకు ఋణమాఫీ చేయలేదని చెప్పారు. ఈ విషయంపై అనేక సందర్భాల్లో రుణమాఫీ బాధిత రైతులు సొసైటీ చైర్మెన్, ఎండీని రుణమఫి చేయాలనీ కోరగా నిధులు విడుదల కాగానే చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని చెప్పారు. రైతు రుణమాఫీ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకి ఫోన్ చేసి సమస్యను వివరించి వారికీ సమయం ఇవ్వాలని కోరారని రైతులు తెలిపారు. అదేవిధంగా రుణమాఫీ విషయంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఘట్కేసర్ రైతు రుణమాఫీ సాధన సమితి కన్వీనర్ కంట్లం గౌరీ శంకరప్ప, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, ధర్మారెడ్డి, రైతులు పాల్గొన్నారు.






