- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో కుటుంబం..5 తులాల బంగారం, కిలో వెండి అపహరణ
మేడిపల్లి పరిధి ఎంఐఎం కాలనీలో దొంగతనం జరిగింది.అమెరికాలో కుటుంబం ఉన్న తరుణంలో ఆ ఇంట్లో దొంగలు పడ్డారు.

దిశ, మేడిపల్లి : మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఎంఐఎం కాలనీలో భారీ దొంగతనం జరిగింది. నాలుగు నెలలుగా అమెరికాలో కుటుంబం ఉన్న తరుణంలో ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంఐఎం కాలనీకి చెందిన ఎన్. పద్మనాభ శర్మ దంపతులు ఇద్దరు 4 నెలల క్రితం అమెరికాలో నివాసం ఉండే తమ కూతురు వద్దకు వెళ్లారు. అప్పటి నుంచి ఆ ఇంటికి తాళం వేసి ఉంది.
ఇది గమనించిన దుండగులు, సోమవారం ఉదయం ఇంట్లోకి ప్రవేశించి నగదును అపహరించారు. అయితే, ఆ ఇంటి నుంచి శబ్దాలు వచ్చాయి. ఇది గమనించిన పక్కింటి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి విగ్నేశ్వర్ గట్టిగా అరవడంతో గోడ దూకి పారిపోయారు దొంగలు. ఇట్టి విషయంపై వ్యక్తి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా ఈ సంఘటనలో ఎన్. పద్మనాభ శర్మ ఇంట్లో 5 తులాల బంగారం, కేజీ వెండి వస్తువులు దొంగతనం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.






