- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుర‘పోరు’కు అంతా సిద్దం..!
పురపోరుకు సర్వం సిద్దమైంది. ఇక ఎన్నికల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.

దిశ, మేడ్చల్ బ్యూరో : పురపోరుకు సర్వం సిద్దమైంది. ఇక ఎన్నికల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. అనువైన తేదీలపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం
మేడ్చల్ జిల్లాలో కొత్తగా మూడు చింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. మూడు మున్సిపాలిటీలలో మొత్తం 65,866 ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 33,051 మంది, మహిళ ఓటర్లు 32,812 మంది, ట్రాన్స్ జెండర్లు ముగ్గురు ఉన్నారు.మూడు మున్సిపాలిటీలలో 68 వార్డులకు గాను 136 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.మరోవైపు మున్సిపల్ ఛైర్మన్లు, వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్లను ఖారారు చేశారు. ఎన్నికల సన్నహల్లో భాగంగా బ్యాలెట్ బాక్సులు పరిశీలన, టీ పోల్ యాప్ లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ను పూర్తి చేశారు.రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
పటిష్ట నిఘా..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో ఉన్న పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు తెలసింది.మొత్తం 136 పోలింగ్ స్టేషన్లలోనూ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు తొలిసారిగా వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం సన్నహాలు చేస్తోంది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పరిసరరాల్లో సిసి కెమెరాలు బిగించాలని నిర్ణయించినట్లు సమాచారం.ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు తొలిసారిగా డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించాలని ఎన్నికల యంత్రాంగం భావిస్తోంది. మరోవైపు ఓట్ల లెక్కింపు కేంద్రాలను కూడా ఇప్పటికై గుర్తించగా, తొలిసారిగా టేబుళ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.పోలీస్ శాఖ బందోబస్తుకు సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు సమాచారం.






