- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలరించిన భరతనాట్య ప్రదర్శన
ఉప్పల్ మినీ శిల్పారామం లో నవరాత్రి బతుకమ్మ, దసరా సంబరాలు సారీస్ అఫ్ ఇండియా మేళ

దిశ, ఉప్పల్ : ఉప్పల్ మినీ శిల్పారామం లో నవరాత్రి బతుకమ్మ, దసరా సంబరాలు సారీస్ అఫ్ ఇండియా మేళ సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత చీరలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. పోచంపల్లి, గుజరాత్ బందీని, బీహార్ భాగల్పూరి, సోలాపూర్, హ్యాండ్ బ్లాక్ , తస్సార్ బనారస్ మొదలైన చేనేత చీరలు అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు అధిక సంఖ్య లో పాల్గొని చేనేత కళాకారులు ప్రోత్సహించవలసినదిగా శిల్పారామం అధికారులు కోరుతున్నారు.
సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ వారి సంయుక్త నిర్వహణలో చత్తీస్గర్ద్ జానపద నృత్యం కామరా నృత్యం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుడుంబాజా నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వైదేహి సుభాష్ శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి , మహిషాసురమర్దిని, మహాకాళి, అమ్బస్తుతి, అర్ధనారీశ్వర , తిల్లాన అంశాలను గాయత్రీ, లాస్యశ్రీ, అనఘా, మేధ,మణిప్రసాద్,అక్షిత కరుణ మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు.






