- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్ఎంటి పరిశ్రమ పునరుద్ధరణకు కృషి
హెచ్ఎంటి కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటుగా భూముల పరిరక్షణ కోసం త్వరలోనే రెవిన్యూ, జిహెచ్ఎంసి అధికారులతో

దిశ, పేట్ బషీరాబాద్: హెచ్ఎంటి కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటుగా భూముల పరిరక్షణ కోసం త్వరలోనే రెవిన్యూ, జిహెచ్ఎంసి అధికారులతో సమన్వయం చేసుకొని కబ్జాలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లనున్నట్లు హెచ్ఎంటి తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ చీఫ్ పాట్ట్రాన్ మెదక్ బిజెపి పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పేర్కొన్నారు. చింతల్ హెచ్ఎంటి కార్యాలయంలో గురువారం ఆయన సంబంధిత అధికారులు కార్మికులతో సమావేశం అయ్యారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన హెచ్ఎంటి పరిశ్రమ నేడు అత్యంత దీనస్థితిలో ఉన్నదని, ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తో చర్చించడం జరిగిందని పరిశ్రమకు పూర్వం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయని, పరిశ్రమ పునర్వ్యవస్థీకరణ కోసం నిపుణుల సలహాలుతో క్షేత్రస్థాయి అధ్యయనం చేసి దాని ప్రకారం అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తామని అన్నారు. అదేవిధంగా శతాబ్దాలు గా పరిష్కారం కానీ హెచ్ఎంటి కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చేయడంతో పాటుగా ఉద్యోగులకు చెల్లించాల్సిన పలు రకాల బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చింతల్ హెచ్ఎంటి పరిశ్రమ భూములు సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నల్ల జయశంకర్ గౌడ్, జీడిమెట్ల డివిజన్ బిజెపి అధ్యక్షులు పులిబలరాం, సతీష్, కంది శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.






