- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ : కలెక్టర్ మను చౌదరి
సికింద్రాబాద్ నుంచి శామీర్ పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి ఇచ్చిన తూంకుంట రైతులకు చెక్కులను మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి పంపిణీ చేశారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : సికింద్రాబాద్ నుంచి శామీర్ పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి ఇచ్చిన తూంకుంట రైతులకు చెక్కులను మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి పంపిణీ చేశారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్లో సికింద్రాబాదు నుండి శామీర్ పేట్ వరకు రాజీవ్ రహదారి నిర్మాణానికి తూంకుంట గ్రామంలో 24 ఏకరాలకు మొదటి విడతగా 14203 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చిన రైతులకు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ 103 కోట్ల రూపాయల చెక్కును అందజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి దఫాగా ఈ చెక్కులు అందించడం జరిగిందని, మిగిలిన వారికి తరువాత అందించడం జరుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. తమ భూమికి చదరపు గజం లక్ష రూపాయలుగా ధర నిర్ణయించడంలో కలెక్టర్ చోరవ తీసుకున్నారని రైతులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సర్పంచ్ సాగర్, సంజయ్ అగర్వాల్, విజయలక్ష్మి, సతీష్, పద్మప్రసాద్, అరుణ కలెక్టర్ ను శాలువతో సన్మానించారు.






