- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్: పారిశుద్ధ కార్మికులకు సామాగ్రి పంపిణీ
by Taduka Kalyani |
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ కార్మికులకు పంపిణీ చేయాల్సిన సామాగ్రి కొన్ని నెలలుగా ఆవరణలోనే వదిలేశారు.

X
దిశ, మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ కార్మికులకు పంపిణీ చేయాల్సిన సామాగ్రి కొన్ని నెలలుగా ఆవరణలోనే వదిలేశారు. ‘దిశ’ లో సోమవారం ప్రచురితమైన ఈ వార్తకు స్పందించిన బోడుప్పల్ మున్సిపల్ అధికారులు స్పందించారు. మంగళవారం సామాగ్రిని మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కార్మికునికి సంతూరు సబ్బులు 12, రిన్ సబ్బులు 12, నూనె లీటర్, గ్లౌజులు 2 జతలు, సేఫ్టీ అప్రాన్ 2, రెయిన్ కోట్ లు పంపిణీ చేశారు. రెండు సంవత్సరాల తరువాత సామాగ్రి ఇస్తున్నారని, ఎప్పటికైనా సామాగ్రి పంపిణీ చేసినందుకు నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పారిశుద్ధ కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మంజులత, ఎస్ఐ జాన్ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






