సీఎం రేవంత్​ రెడ్డి నాయకత్వంలో కూకట్​పల్లిలో అభివృద్ధి : టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్​

by Batti.Sumithra |

ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి నాయకత్వంలో కూకట్​పల్లి నియోజకవర్గం సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్​ అన్నారు.

సీఎం రేవంత్​ రెడ్డి నాయకత్వంలో కూకట్​పల్లిలో అభివృద్ధి : టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్​
X

దిశ, కూకట్​పల్లి : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి నాయకత్వంలో కూకట్​పల్లి నియోజకవర్గం సమస్యలను పరిష్కరించేందుకు, అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం కేపీహెచ్​బీ డివిజన్​ పరిధిలోని గోపాల్​ నగర్​ కాలనీలో ఆదివారం స్థానిక సమస్యల పై బండి రమేష్​ పాదయాత్ర నిర్వహించారు. కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఉన్న చాలా పార్కులు కబ్జాకు గురయ్యాయని కాలనీ వాసులు బండి రమేష్​ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో బండి రమేష్​ పార్కుల కబ్జా విషయంలో హైడ్రా సీఐ రమేష్​తో మాట్లాడి పార్కుల కబ్జా విషయం పై చర్యలు తీసుకోవలని సూచించారు.

గోపాల్​ నగర్​ లేఔట్​లోని పార్కు స్థలాలను గుర్తించి వాటిలోని ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని బండి రమేష్​ హామీ ఇచ్చారు. గోపాల్​ నగర్​లో కొన్ని వీధులలో రోడ్లు, వీధి దీపాల సమస్య ఉందని కాలనీ వాసులు బండి రమేష్​ దృష్టికి తీసుకు వచ్చారు. కాలనీలో సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు ప్రవీణ్​, రంగమోహన్​ తదితరులు పాల్గొన్నారు.

Next Story