కేఎఫ్‌సీలో కుళ్లిపోయిన చికెన్ అంటూ కస్టమర్ గొడవ

by Jakkula.Mamatha |

కూకట్​పల్లి అశోక వన్​ మాల్​లోని కేఎఫ్​సి ఔట్​లెట్​లో కుళ్లిపోయిన చికెన్​ కలకలం రేపింది.

కేఎఫ్‌సీలో కుళ్లిపోయిన చికెన్ అంటూ కస్టమర్ గొడవ
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి అశోక వన్​ మాల్​లోని కేఎఫ్​సి ఔట్​లెట్​లో కుళ్లిపోయిన చికెన్​ కలకలం రేపింది. శనివారం స్నేహితులతో కలిసి వచ్చిన కస్టమర్​ సహిర్​ చికెన్​ బకెట్, బర్గర్​లను ఆర్డర్​ చేశాడు. తినడానికి ప్రయత్నించిన కస్టమర్​ కుళ్లిపోయిన వాసన రావడంతో కేఎఫ్​సి నిర్వాహకులను నిలదీశాడు. తప్పు జరిగింది అంటూ కస్టమర్​కు చెల్లించిన మొత్తాన్ని రిటర్న్​ చేశారు. చిన్న పిల్లలు కుళ్లి పోయిన పదార్థం తిని రోగాల బారిన పడితే ఎవరు బాధ్యులు అంటు కస్టమర్​తో పాటు అక్కడే ఉన్న మరి కొంత మంది కేఎఫ్​సి ఔట్​లెట్​ నిర్వాహకులను ప్రశ్నించారు. మున్సిపల్​ అధికారులు, ప్రభుత్వం కుళ్లి పోయిన పదార్థాలు విక్రయిస్తున్న కేఎఫ్​సి ఔట్​లెట్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్​ చేశారు.

Next Story