ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడండి

by velandi.Saikiran |

జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ హైస్కూల్‌ను సీపీఐ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించారు.

ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడండి
X

దిశ, మేడిపల్లి: మల్కాజిగిరి కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ హైస్కూల్‌ను సీపీఐ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించిన నాయకులు ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి వారి; సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రచ్చ కిషన్ మాట్లాడుతూ పాఠశాలలో 625 మంది విద్యార్థులు ఉండగా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, ప్రధానోపాధ్యాయుని పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు. అలాగే మూడు తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని, వెంటనే కొత్త భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.

తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల సమస్యలతో పాటు మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపాలపై విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మేడిపల్లి మండల సహాయ కార్యదర్శిలు సిహెచ్ మాధవి, జి నాగరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి అన్వర్, బీసీ సంఘం జిల్లా నాయకులు కే ప్రమీల, బాపురాజు, మండల కౌన్సిల్ సభ్యులు రమాతార, నర్సమ్మ పార్టీ నాయకులు ఇస్తారి, గణేష్, సోమరాజు, సరిత, భారతి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story