- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్య యత్నం..
ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, కూకట్ పల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కడుపులో తీవ్రగాయాలతో భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా ఈర్లపాలెంకు చెందిన రామకృష్ణా రెడ్డి, రమ్య కృష్ణతో కలిసి కెపిహెచ్బి కాలనీ 6వ పేజ్‌లో నివాసం ఉంటున్నారు. రామకృష్ణారెడ్డికి అప్పులు పెరగడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో మనస్తాపం చెందిన రామకృష్ణారెడ్డి భార్య రమ్యకృష్ణతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు పదునైన వస్తువుతో కడుపులో పొడుచుకున్నారు. దీంతో రామకృష్ణారెడ్డికి తీవ్ర గాయాలు అవ్వడంతో అతను మృతి చెందాడు. ఈ విషయాన్ని రమ్యకృష్ణ పోలీసులకు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలికి ప్రవేశించి చూడగా రమ్యకృష్ణ కడుపు భాగంలో తీవ్రగాయాలతో ఉంది. రామకృష్ణను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రమ్యకృష్ణ భర్త రామకృష్ణారెడ్డిని హత్య చేసిందా అనే అనుమానం రావడంతో ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.






