ఆగస్టు లోపు పెండింగ్​ పనులు పూర్తి చేయండి: ఎమ్మెల్యే మాధవరం

by Taduka Kalyani |

ఆగస్టు నెల లోపు నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

ఆగస్టు లోపు పెండింగ్​ పనులు పూర్తి చేయండి: ఎమ్మెల్యే మాధవరం
X

దిశ, కూకట్​పల్లి: ఆగస్టు నెల లోపు నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కార్పొరేటర్లు, జీహెచ్​ఎంసీ, విద్యుత్​ శాఖ, జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న డ్రైనేజి పైప్​లైన్​ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలకు, ఈదురు గాలులకు విద్యుత్​ స్తంభాలు కూలి పోతుండటంతో విద్యుత్​ సమస్య ఉత్పన్నమవుతుందని, జీహెచ్​ఎంసీ, విద్యుత్​ శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళిక బద్దంగా పని చేయాలని, అకాల వర్షాలకు వరద సమస్య, విద్యుత్​ సమస్యలు లేకుండా చూడాలని, పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులను ఆగస్టు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబీహ బేగం, ఆవుల రవీందర్​ రెడ్డి, మందాడి శ్రీనివాస్​ రావు, మాజీ కార్పొరేటర్​ తూం శ్రావణ్​ కుమార్​, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు గౌసుద్దిన్​, జోనల్​ ఎస్​ఈ చెన్నారెడ్డి, ఈఈలు సత్యనారాయణ, గోవర్ధన్​ గౌడ్​, డీఈలు ఆనంద్​, శ్రీదేవి, ఏఈలు అరవింద్​, శివప్రకాష్​ తదితరులు పాల్గొన్నారు.

Next Story