హిందూ, ముస్లిం, క్రైస్త‌వ స్మ‌శాన వాటిక‌లకు భూమి కేటాయించాల‌ని క‌లెక్ట‌ర్ కి విన‌తి : ఎమ్మెల్యే

by Ratna Kumari |

హిందూ, ముస్లిం, క్రైస్త‌వ స్మ‌శాన వాటిక‌ల కోసం భూమి కేటాయించాల‌ని క‌లెక్ట‌ర్ మ‌ను చౌద‌రికి ఎమ్మెల్యే బండారి ల‌క్ష్మారెడ్డి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

హిందూ, ముస్లిం, క్రైస్త‌వ స్మ‌శాన వాటిక‌లకు భూమి కేటాయించాల‌ని క‌లెక్ట‌ర్ కి విన‌తి : ఎమ్మెల్యే
X

దిశ‌, నాచారం : హిందూ, ముస్లిం, క్రైస్త‌వ స్మ‌శాన వాటిక‌ల కోసం భూమి కేటాయించాల‌ని క‌లెక్ట‌ర్ మ‌ను చౌద‌రికి ఎమ్మెల్యే బండారి ల‌క్ష్మారెడ్డి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. నూతంగా ఏర్పాటు చేసిన హెచ్‌ఎంటి నగర్ డివిజన్‌లో సుమారు 50 వేలకుపైగా జనాభా ఉన్నప్పటికీ, హిందూ, ముస్లిం, క్రైస్తవ సమాజాలకు ప్రత్యేక స్మశాన వాటికలు లేవని వారు కలెక్టర్ దృష్టికి తె చ్చారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంటి నగర్ పెద్ద చెరువు తూర్పు భాగంలో, లక్ష్మీ స్టార్చ్ కంపెనీ వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్మశాన వాటికల కోసం కేటాయించాలని వారు కోరారు. వినతిని పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి సానుకూలంగా స్పందిస్తూ, ఉప్ప‌ల్ త‌హ‌శీల్దార్ ను పరిశీలన చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు సాయి జెన్ శేఖ‌ర్ తో క‌లిసి హెచ్ఎంటీ న‌గ‌ర్ డివిజ‌న్ లో స్మ‌శాన వాటిక‌ల కోసం కేటాయింపు విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

Next Story