చెంగిచర్ల మండిలో ఇరువర్గాల మధ్య ఘ‌ర్ష‌ణ

by Ratna Kumari |

మల్కాజిగిరి కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచర్ల లో ఇరు వర్గాల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి పైసల విషయంలో మరో వర్గానికి చెందిన వ్యక్తిని పిలిచి దాడి చేశారు.

చెంగిచర్ల మండిలో ఇరువర్గాల మధ్య ఘ‌ర్ష‌ణ
X

దిశ, మేడిపల్లి : మల్కాజ్గిరి కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచర్ల లో ఇరు వర్గాల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి పైసల విషయంలో మరో వర్గానికి చెందిన వ్యక్తిని పిలిచి దాడి చేశారు. దీంతో మాట మాట పెరిగి ఇరువర్గాల వ్యక్తులు అక్కడికి చేరుకోడంతో ఒక్కసారిగా గొడవ కాస్త పెద్దగా అయింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఇరు వర్గాల వారిని వారించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తికీ చెవి దగ్గర కట్ అవ్వడంతో అతన్ని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. దీంతో బాధితులకు మద్దతుగా బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని పిర్యాదు చేశారు. నిందుతులను గర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళను చేపడతామని హెచ్చరించారు. ఒక వర్గం వారు పిర్యాదు చేయగా స్వీకరించమని పూర్తి వివరాల పై ద‌ర్యాప్తు చేప‌డుతున్నామని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో బందో బస్త్ ఏర్పాటు చేశారు.

Next Story